Wednesday, November 5, 2008

వంట

బచ్చలి కూర
కావలిసిన సామగ్రి ;
బచ్చలికూర 2కట్టలు
నువ్వులపప్పు ౧/౨ కప్పు
బియ్యపు పిండి ౧ కప్పు
ఎండుమిర్చి ౧౦
చింతపండు గుజ్జు ౩ టీ స్పూన్స్
ఆవాలు ౧ స్పూన్
జీలకర్ర ౧/2స్పూన్
నూనె ౩ స్పూన్స్
ఉప్పు తగినంత , కరివేపాకు ఒక రెమ్మ
తయారు చేయు విదానం :
ముందుగా ఆకును బాగా కడిగి తరిగి ఉంచుకోవాలి , ఇప్పుడు మూకుడులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర,౩ ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి , ఇప్పుడు తరిగి ఉంచిన ఆకుకూరను వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూతపెట్టాలి .
మరో పక్క మిక్సీలో నువ్వులపప్పు ,బియ్యపు పిండి , మిగిలిన ఎండు మిర్చి, చింతపండు గుజ్జు కలిపి , ౧ గ్లాస్ నీరు పోసి గ్రైండ్ చేసుకోవాలి . ఆకు ఉడికిన తరువాత గ్రైండ్ చేసిన ముద్దను అందులో వేసి బాగా కలపాలి , చిక్కగా కావాలనుకుంటే ఉడికిన తరువాత ఒక గిన్నెలో కి తీసుకొని వడ్డించు కోవాలి, లేదా కొంచెం జారుగా కావాలనుకుంటే కొంచెం నీరు పోసి ఒక గిన్నెలోకి తీసుకొని వడ్డించు కోవాలి.

Tuesday, November 4, 2008

పరిచయం

హలో నా ప్రియ మిత్రులకు స్వాగతం ,

ఎందుకిలా ?